ఇన్‌స్టా అకౌంట్ డీయాక్టివేట్ చేసిన హార్దిక్ పాండ్యా...కార‌ణం ఇదే

by velandi.Saikiran |

ఇన్‌స్టా అకౌంట్ డీయాక్టివేట్ చేశాడు హార్దిక్ పాండ్యా.

ఇన్‌స్టా అకౌంట్ డీయాక్టివేట్ చేసిన హార్దిక్ పాండ్యా...కార‌ణం ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ కెప్టెన్, భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన ఇన్‌స్టా అకౌంట్ ను డియాక్టివేట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో అతని ఫాలోవర్స్ అందరికీ యూజర్ నాట్ ఫౌండ్ అని ఇన్‌స్టా లో చూపిస్తోంది. దీంతో హార్దిక్ పాండ్యాకు ఏమైంది ? అతని అకౌంట్ ఎందుకు మాయమైపోయింది ? అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా అన్ని విభాగాలలో విఫలమయ్యాడు.

గత సీజన్ కంటే ఈ సారి దారుణంగా ఫెయిల్యూర్ అయ్యాడు. దీని ఎఫెక్ట్ జట్టుపైన కూడా పడింది. ఈ తరుణంలో ఇటీవల పింక్ కలర్ హైలెట్ అయ్యేలా కొన్ని వస్తువులను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్నట్లు హింట్ ఇచ్చాడు పాండ్యా. ఇక ఇప్పుడు తన ఇన్‌స్టా అకౌంట్ డీయాక్టివేట్ చేసి మరో చర్చకు తెర లేపాడు. అయితే, అప్ప‌ట్లో కోహ్లీ అకౌంట్ కూడా ఇలాగే అయింద‌ని, టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌ల్ల పాండ్యా ఇన్‌స్టా క‌నిపించ‌డం లేదంటూ మ‌రి కొంత‌మంది నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు.


Next Story