ముంబైకి గుడ్ బై..హార్ధిక్ పాండ్యాకు ఆ ఫ్రాంచైజీ బంప‌ర్ ఆఫ‌ర్ !

by velandi.Saikiran |

హార్ధిక్ పాండ్యాకు కేకేఆర్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ముంబైకి గుడ్ బై..హార్ధిక్ పాండ్యాకు ఆ ఫ్రాంచైజీ బంప‌ర్ ఆఫ‌ర్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఉన్న ముంబై ఇండియన్స్, ఈ సారి పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో నిలిచి... ఇంటి దారి పట్టింది. ఐపీఎల్ 2026లో కేవలం నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే విజయకేతనం ఎగరవేసింది. అయితే ముంబై ఫెయిల్యూర్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను అందరూ విలన్ చేశారు. అతని వల్లే ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కనబరిచిందని ఫ్యాన్స్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ను వదిలేసి.. మరో జట్టులోకి వెళ్లేందుకు ఇప్పటికే హార్థిక్ పాండ్యా ప్రయత్నం మొదలు పెట్టాడట‌.

మొన్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో చర్చలు జరిగినట్లు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే, హార్థిక్ పాండ్యా లాంటి వాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మెదలడం కష్టమేనని యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చిందట. దీనిపై ఇప్పుడే ముందుకు వెళ్లొద్ద‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు తాజాగా ఫోన్ న్యూస్ వైరల్ గా మారింది. తమ జట్టులోకి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకునేందుకు కేకేఆర్ తొలి అడుగు వేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ డీల్ సెట్ అయితే కేకేఆర్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా మెరువనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఉన్నాయి. రహానే స్థానంలో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తార‌ని టాక్‌. నిజంగానే కేకేఆర్ నుంచి ఈ ఆఫర్ వస్తే ముంబైని వదిలేసేందుకు హార్థిక్ పాండ్యా కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Next Story