మరోసారి చిత్తైన కోల్కతా.. ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

by Muthe.Rajitha |

IPL లో భాగంగా జరిగిన నేటి మ్యాచులో కోల్కతా మరో ఓటమి చవిచూసింది.

మరోసారి చిత్తైన కోల్కతా.. ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : IPL లో భాగంగా జరిగిన నేటి మ్యాచులో కోల్కతా మరో ఓటమి చవిచూసింది. గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన పోరులో గుజరాత్ 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత కోల్కతా నిర్ణీత 20 ఓవర్లకు 180 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. కేకేఆర్ కాస్ట్లీ ఆటగాడు గ్రీన్ కామెరూన్ 79 పరుగులు చేసి రాణించాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ గిల్(86) పరుగులతో రాణించాడు. చివరి వరకు ఉత్కంఠత తో సాగిన ఈ మ్యాచులో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే GT ఆట ముగించింది. కాగా ఈ సీజన్ లో కోల్కతాకు ఇది 5వ పరాజయం. అసలు ఈ సీజన్లో ఇప్పటి వరకు KKR ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇక గుజరాత్ కు ఇది 3వ విజయం.

Next Story