- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి
గుజరాత్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి పాలైంది.

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఘోర ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించిన గుజరాత్ టైటాన్స్, ఏకంగా 82 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి కాటేరమ్మ కొడుకులు నిలబడలేకపోయారు.
అహ్మదాబాద్ స్టేడియంలో బెంబేలెత్తిపోయారు. హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, స్మరణ్, నితీష్ కుమార్ రెడ్డి సింగిల్ డిజిట్ కు ఔట్ అయ్యారు. క్లాసెన్ 14 పరుగులు చేయగా, కెప్టెన్ కమిన్స్ 19 పరుగులు చేసి వెనుతిరిగారు. ఈ దెబ్బకు 14.5 ఓవర్ లోనే 86 పరుగులు చేసిన హైదరాబాద్ ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పైన విజయంతో పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్ కు వెళ్ళింది. రెండో స్థానంలో బెంగళూరు ఉండగా.. మూడో స్థానంలో హైదరాబాద్ కొనసాగుతోంది.






