IPL 2026: లక్నోలో గుజరాత్ 'టైటాన్స్' విజయం..

by Gantepaka Srikanth |

అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

IPL 2026: లక్నోలో గుజరాత్ టైటాన్స్ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఏకపక్ష విజయాన్ని అందుకుంది. హోమ్ గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్నోపై ఘనవిజయం సాధించారు. లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ జాస్ బట్లర్‌లు అదరగొట్టారు. జాస్ బట్లర్ 60 పరుగులతో జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్, 56 పరుగులతో రాణించి అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. మొదట బ్యాటింగ్‌లో కేవలం 164 పరుగులకే పరిమితమైన లక్నో, బౌలింగ్‌లోనైనా అద్భుతం చేసి గుజరాత్‌ను అడ్డుకుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంలో విఫలమవడంతో గుజరాత్ బ్యాటర్లు ఎక్కడా తడబడకుండా లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోగా, సొంత గడ్డపై ఓటమి పాలవ్వడం లక్నో సూపర్ జెయింట్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మొత్తంగా 18.4 బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయి గుజరాత్ 165 పరుగులు చేసి విజయం సాధించింది.

Next Story