పంజాబ్ కింగ్స్ మ‌రో ఓట‌మి

by velandi.Saikiran |

పంజాబ్ పై 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విక్టరీ అందుకుంది.

పంజాబ్ కింగ్స్ మ‌రో ఓట‌మి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఆదివారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠ పోరు సాగింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విక్టరీ అందుకుంది. రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా... ఓ భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు గుజరాత్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. దీంతో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంది. అదే సమయంలో మొన్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్, ఇవాళ మరో ఓటమిని మూటగట్టుకుంది.

4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విక్టరీ

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 163 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్, 19.5 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి మ్యాచ్ ఫినిష్ చేసింది. దీంతో పంజాబ్ పై 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విక్టరీ అందుకుంది.

Next Story