- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > గిల్, సాయి సుదర్శన్ మెరుపులు..చెన్నై టార్గెట్ ఎంతంటే ?
గిల్, సాయి సుదర్శన్ మెరుపులు..చెన్నై టార్గెట్ ఎంతంటే ?
by velandi.Saikiran |
గిల్, సాయి సుదర్శన్ రాణించిన నేపథ్యంలో గుజరాత్ భారీ స్కోర్ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు సాధించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో భారీ స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్ లో 53 బంతుల్లో సాయి సుదర్శన్ 84 పరుగులు చేయగా, గిల్ 37 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు. అటు వికెట్ కీపర్ జోస్ బట్లర్ 27 బంతుల్లోనే 57 పరుగులు చేసి రాణించాడు. ఈ దెబ్బకు 229 పరుగులు సాధించింది గుజరాత్. ఇక ఈ మ్యాచ్ లో మరో అర్థ సెంచరీ నమోదు చేసిన సాయి సుదర్శన్, మళ్లీ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇందులో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరనున్న చెన్నై... ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.
Next Story






