సిగరెట్ తాగుతూ దొరికిన‌ గుజరాత్‌ ప్లేయర్‌

by velandi.Saikiran |   (  Updated:2026-04-22 15:21:55  IST  )

కగిసో రబాడా మరో వివాదంలో చిక్కుకున్నాడు. సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు.

సిగరెట్ తాగుతూ దొరికిన‌ గుజరాత్‌ ప్లేయర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడా మరో వివాదంలో చిక్కుకున్నాడు. సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. గుజరాత్ టైటాన్స్ టీమ్ సభ్యులు ఉంటున్న హోటల్ పరిసరాలలో కగిసో రబాడా స్మోకింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ హోటల్ బాల్కనీలో ఉన్న కొంతమంది రబాడా బాగోతం మొత్తం ఫోన్ల‌లో క్యాప్చర్ చేశారు. దీంతో స్మోక్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. కగిసో రబాడపై కచ్చితంగా బీసీసీఐ బ్యాన్ విధిస్తారని పోస్టులు పెడుతున్నారు.

రబాడాపై చ‌ర్య‌లు తీసుకునే ఛాన్స్‌

అయితే, బీసీసీఐ రూల్స్ ప్రకారం ఇది డోపింగ్ నిబంధనలు, ప్రొఫెషనల్ కోడ్స్ కు విరుద్ధం కాదని కొంతమంది క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కానీ బహిరంగ ప్రదేశంలో స్మోకింగ్ చేశాడన్న ఒక్క కారణంతో రబాడాపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ఏడాది కిందట డ్రగ్స్ వివాదంలో రబాడా చిక్కుకున్నాడు. 2025, SA 20 లీగ్ సందర్భంగా రబాడాకు కొకైన్ మెటాబోలైట్స్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో అతనిపై కొన్ని నెలల పాటు సస్పెన్షన్ విధించారు. అయినప్పటికీ ఐపీఎల్ లోకి రబాడాను తీసుకుంది బీసీసీఐ. కానీ ఇప్పుడు స్మోకింగ్ చేస్తూ మరో వివాదంలో చెప్పుకున్నాడు రబాడా. క్లిక్

Next Story