IPL : ఫైనల్లోకి గుజరాత్

by Muthe.Rajitha |

ఐపీఎల్ (IPL) 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్(GT) మరోసారి అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది.

IPL : ఫైనల్లోకి గుజరాత్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ (IPL) 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్(GT) మరోసారి అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ముల్లాన్‌పుర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత క్వాలిఫయర్-2 పోరులో రాజస్థాన్ రాయల్స్‌(RR)పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ విజయంతో మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ ముందు 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంత పెద్ద టార్గెట్‌ను గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఎక్కడా ఒత్తిడికి లోనవ్వకుండా కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెలరేగి అద్భుత సెంచరీ (104 పరుగులు) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అతనికి తోడుగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (58 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరి భాగస్వామ్యం రాజస్థాన్ బౌలర్లను పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది. బ్యాటర్లు 214 పరుగులు చేసినప్పటికీ రాజస్థాన్ బౌలర్లు గుజరాత్ రన్ రేట్‌ను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఆ జట్టు బౌలర్లలో బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్, నandre బర్గర్ తలో వికెట్ తీసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story