DC vs GT : బోణీ కొట్టిన గుజరాత్

by Muthe.Rajitha |

IPL 2026 సీజన్లో గుజరాత్ బోణీ కొట్టింది.

DC vs GT : బోణీ కొట్టిన గుజరాత్
X

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో గుజరాత్ బోణీ కొట్టింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ.. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (70), జోస్ బట్లర్ (52), వాషింగ్టన్ సుందర్ (55) హాఫ్ సెంచరీలు సాధించారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫోర్లు, సిక్సులు బాది ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు.

ఇక 211 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ.. చివరి వరకూ పోరాడి 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి, కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. KL రాహుల్(92) పరుగులు చేయగా.. చివర్లో వచ్చిన డేవిడ్ మిల్లర్ (41) మెరుపులు మెరించినా లాభం లేకుండా పోయింది. చివరి బతి వరకు టెన్షన్ గా సాగిన ఈ మ్యాచులో గుజరాత్ విజయం సాధించి, ఈ సీజన్లో తొలి గెలుపు ఖాతా తెరిచింది.

Next Story