- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GT Vs PK: విజయం దిశగా పంజాబ్ కింగ్స్.. మరో 57 పరుగుల చేస్తే ఖేల్ ఖతం
IPL 2026లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్ కానల్లీ, శ్రేయస్ అయ్యర్ చూడచక్కనైన మెరుపులు మెరిపిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హోమ్ గ్రౌండ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) పంజా విసురుతోంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్, ప్రస్తుతం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. యువ ఆటగాడు కూపర్ కానల్లీ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌ను పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) రాణించినప్పటికీ, మిగిలిన వారు వేగంగా పరుగులు చేయలేకపోయారు. పంజాబ్ బౌలర్ వైశాఖ్ విజయ్‌కుమార్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి గుజరాత్ స్కోరును కట్టడి చేశాడు. స్పిన్నర్ చాహల్ కూడా 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
పంజాబ్ ఛేదన.. కానల్లీ మెరుపులు
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7) త్వరగానే అవుట్ అయినప్పటికీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (37) మెరుపులు మెరిపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కూపర్ కానల్లీ కేవలం 27 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (17) కూడా ధాటిగా ఆడుతున్నాడు. పంజాబ్ స్కోరు ప్రస్తుతం 11.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 52 బంతుల్లో కేవలం 57 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.






