- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంగడి కోసం గ్రీన్ కారిడార్.. తప్పిన ప్రాణాపాయం
ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగడి తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించేందుకు ఢిల్లీ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా PBKS, DC మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ ప్రియాంష్ ఆర్య కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఎంగిడి వెనక్కి పరుగెత్తారు. అయితే, బంతిని అందుకునే క్రమంలో పట్టు తప్పి వెల్లకిలా పడిపోవడంతో, ఆయన తల నేలకు గట్టిగా తగిలింది. ఈ ప్రమాదంలో ఎంగిడి తలకు తీవ్రమైన గాయం కావడంతో రక్తం కారడం ప్రారంభమైంది. ఎంగిడి మైదానంలోనే స్పృహ కోల్పోవడంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు, స్టేడియం భద్రతా సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. గాయపడిన ఆటగాడిని అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు ఢిల్లీ పోలీసులు తక్షణమే గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. సాధారణంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ వీధుల్లో స్టేడియం నుండి ఆసుపత్రి వరకు ఉన్న మార్గాన్ని కేవలం 11 నిమిషాల్లోనే చేరుకునేలా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఎంగిడిని సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చగా.. ఎంగడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ అందించిన సమాచారం ప్రకారం.. ఎంగిడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. తలకు తీవ్రమైన గాయం అయినప్పటికీ, ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని డాక్టర్లు వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రీన్ కారిడార్ ద్వారా ఎంగిడి ప్రాణాలు కాపాడిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.






