IPL ఫైనల్ వేదిక మార్పుపై DK శివ కుమార్ క్లారిటీ!

by velandi.Saikiran |

IPL ఫైనల్ వేదిక మార్పుపై DK శివ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

IPL ఫైనల్ వేదిక మార్పుపై DK శివ కుమార్ క్లారిటీ!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో నిర్వహించాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ కు తరలి వెళ్ళింది. కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఐపీఎల్ టికెట్లు కావాలని గొడవ చేస్తున్న క్రమంలో.. బీసీసీఐ వేదికను తరలించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై DK శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.

త‌మ‌పై వస్తున్న విమర్శలను కొట్టి పారేసిన శివకుమార్, అసలు వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. అహ్మదాబాద్ లో భారీ స్టేడియం ఉంద‌న్నారు. ఈ త‌రుణంలో ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండటం కారణంగా బీసీసీఐ వేదికను తరలించినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేలకు టికెట్ల పంపిణీ గొడవలకు, వేదిక మార్పునకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా ఐపీఎల్ ఫైన‌ల్ అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగ‌నుండ‌గా, క్వాలిఫైయ‌ర్ 1 ధ‌ర్మ‌శాలలో జ‌రుగ‌నుంది. మిగిలిన రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు న్యూ చండీగ‌ఢ్ వేదిక‌గా జ‌రుగుతాయి.

Next Story