బ్రెవిస్ భారీ సిక్స‌ర్‌.. త‌మిళ హీరో రియాక్షన్ వైర‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-05-18 17:05:05  IST  )

చెన్నై బ్యాట‌ర్ బ్రెవిస్ భారీ సిక్స‌ర్ కొట్టిన త‌రుణంలో ధ‌నుష్ రియాక్షన్ వైర‌ల్ గా మారింది.

బ్రెవిస్ భారీ సిక్స‌ర్‌.. త‌మిళ హీరో రియాక్షన్ వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా డేంజర్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా రాణించాడు. కేవలం 27 బంతుల్లో 44 పరుగులు చేసి, హైదరాబాద్ కు చుక్కలు చూపించాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, రెండు బౌండరీలు ఉన్నాయి. అర్థ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ... చెన్నై సూపర్ కింగ్స్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు డెవాల్డ్ బ్రెవిస్. ఇక ఈ మ్యాచ్ లో మలింగా బౌలింగ్ లో ఓ భారీ సిక్సర్ కొట్టాడు బ్రెవిస్. ఈ క్రమంలో ఈ సిక్సర్ చూసి, తమిళ హీరో ధనుష్ షాక్ అయ్యాడు. ఏం సిక్సర్ రా నాయనా అన్నట్లుగా బిత్తర పోయాడు. ఈ క్రమంలో ధనుష్ రియాక్షన్ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. క్లిక్

Next Story