- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిల్లర్ పై ఢిల్లీ ఫ్యాన్స్ ఫైర్
గుజరాత్ తో ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ఓడిపోవడానికి బ్యాట్సమెన్ డేవిడ్ మిల్లరే కారణం అంటూ ఢిల్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొన్న ఓటమి ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం చేజారిపోవడం, అందులోనూ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తీసుకున్న నిర్ణయం ఢిల్లీ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. గెలవాల్సిన మ్యాచ్‌ను మిల్లర్ తన అతి తెలివితో లేదా తప్పుడు అంచనాతో చేజేతులా పాడుచేశాడని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మ్యాచ్ ఉత్కంఠ దశకు చేరుకున్న వేళ, ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు అవసరమయ్యాయి. 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ, మిల్లర్ దానిని తిరస్కరించాడు. చివరి బంతికి తనే ఫోర్ లేదా సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాలనే అతివిశ్వాసంతో అతను రన్ తీయలేదు. అయితే, చివరి బంతికి కనీసం ఒక పరుగు తీసి మ్యాచ్‌ను టై చేద్దామని ప్రయత్నించినప్పటికీ, మరో ఎండ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. ఒకవేళ 5వ బంతికే సింగిల్ తీసి ఉంటే, మ్యాచ్ కనీసం సూపర్ ఓవర్ వరకు వెళ్లేదని, మిల్లర్ స్వార్థం వల్లే ఢిల్లీ ఓడిపోయిందని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
అంతేకాదు ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక విచిత్రమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అత్యధిక సార్లు కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్‌లు ఓడిపోయిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. 2015 లో చెన్నై తో జరిగిన మ్యాచ్‌లో, 2016 లో గుజరాత్ లయన్స్‌పై, 2021 లో RCB చేతిలో, ఈ సీజన్లో మళ్ళీ గుజరాత్ టైటాన్స్‌తో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 'దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్' అని పిలుస్తున్న నెటిజన్లు, ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో మిల్లర్ తీరును తప్పుబడుతున్నారు. "ఒక సీనియర్ ప్లేయర్ అయి ఉండి, మ్యాచ్ పరిస్థితిని బట్టి సింగిల్ తీయకుండా జట్టును ఓడించడం క్షమించరాని నేరం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






