కేకేఆర్ కు చిత్తు...ఢిల్లీ అదిరిపోయే విక్ట‌రీ

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి మ్యాచ్ లో కేకేఆర్ ను చిత్తు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

కేకేఆర్ కు చిత్తు...ఢిల్లీ అదిరిపోయే విక్ట‌రీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి మ్యాచ్ లో కేకేఆర్ ను చిత్తు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ పై ఏకంగా 40 పరుగులు తేడాతో ఢిల్లీ విజయం నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, ఐదు వికెట్ల నష్టానికి 203 ప‌రుగులు సాధించింది.

ఇక ఈ క్రమంలో ఛేజింగ్ కు దిగిన కేకేఆర్ చేతులెత్తేసింది. 18.4 ఓవర్లలో 163 పరుగులు చేసి అలౌట్ అయింది. ఈ క్రమంలోనే ఢిల్లీ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. మిగిలిన ఆరు జట్లు ఎలిమినేట్ అయ్యాయి.

Next Story