- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగిన వర్షం...టాస్ గెలిచిన ఢిల్లీ, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి తొలగినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి తొలగినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఢిల్లీలో వర్షం పడగా, కాసేపటికి క్రితమే ఆగిపోయింది. దీంతో ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ కు సంబంధించిన టాస్ కూడా వేశారు. ఇందులో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్, మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మళ్లీ మ్యాచ్ మధ్యలో వర్షం ఏ సమయంలోనైనా పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
ఢిల్లీ వర్సెస్ గుజరాత్.. ఎవరిదిపై చేయి అంటే ?
ఐపీఎల్ టోర్నమెంటులో ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మధ్య ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గుజరాత్ పై చేయి సాధించింది. ఢిల్లీ పైన నాలుగు విజయాలను నమోదు చేసుకున్న గుజరాత్, ఇవాళ కూడా విక్టరీ కొట్టేందుకు తహతహలాడుతోంది. అటు గుజరాత్ పైన మూడు విజయాలు నమోదు చేసిన ఢిల్లీ, ప్రస్తుత ఫామ్ ప్రకారం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.






