వైభవ్ సూర్యవంశీ కోసం కమిన్స్ ప్రత్యేక ప్లాన్.. నేటి మ్యాచులోను సక్సెస్ అయ్యేనా..?

by Malleboina Mahesh |

ఐపీఎల్ ఎలిమినేటర్‌లో నేడు సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఆర్ఆర్ సంచలనం వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు ఎస్ఆర్‌హెచ్ ప్లాన్స్ సిద్ధం చేసింది.

వైభవ్ సూర్యవంశీ కోసం కమిన్స్ ప్రత్యేక ప్లాన్.. నేటి మ్యాచులోను సక్సెస్ అయ్యేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఈ రోజు ఎలిమినేటర్ 1 మ్యాచ్ (Eliminator 1 match) న్యూ చంఢీఘర్ వేదికగా జరగనుంది. ఈ డూ ఆర్ డై మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ సీజన్ మొత్తంలో అన్ని జట్లకు ముచ్చెమటలు పట్టించిన వైభవ్ సూర్యవంశి (Vaibhav Suryavanshi)పై కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Captain Pat Cummins) ప్రత్యేకమైన ప్లాన్స్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై ఆడిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్, నేడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే, ప్యాట్ కమిన్స్ సేనకు రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రూపంలో పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 583 పరుగులు సాధించి, ఇప్పటికే ఎస్ఆర్‌హెచ్‌పై ఒక మెరుపు సెంచరీ బాదిన వైభవ్‌ను కట్టడి చేసేందుకు తాము A ప్లాన్-B, ప్లాన్-C ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జియోస్టార్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

మరోవైపు, గత రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌పై సాధించిన విజయాలు తమ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని, ప్రత్యర్థి జట్టు బలబలాలపై తమకు పూర్తి అవగాహన ఉందని కమిన్స్ పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్ కొత్తగా ప్రారంభమైనప్పటికీ, గత విజయాల నమ్మకంతో ఫైనల్స్‌కు చేరతామని ధీమా వ్యక్తం చేశాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్‌లతో సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు పటిష్టంగా ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ఫెరీరాలతో రాజస్థాన్ రాయల్స్ సైతం అంతే దూకుడుగా కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ విధ్వంసకర ఆటగాళ్లు ఉండటంతో ఈ ఎలిమినేటర్ పోరు క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయి హై-వోల్టేజ్ థ్రిల్లర్‌ను అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story