IPL 2026 : ఎట్టకేలకు బోణి కొట్టిన CSK

by Muthe.Rajitha |

IPL 2026 సీజన్లో CSK ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది.

IPL 2026 : ఎట్టకేలకు బోణి కొట్టిన CSK
X

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో CSK ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన CSK.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (115*) సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ ఐపీఎల్‌లో నమోదైన తొలి శతకం ఇదే కావడం విశేషం. ఆయుష్‌ మాత్రే (59), శివమ్ దూబె (20*) పరుగులు చేశారు. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (60), నిశాంక (41) మాత్రమే రాణించారు. మిగిలిన వారంతా పరుగులు రాబట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారు. చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్‌ 4, అన్షుల్‌ కాంబోజ్‌ 3 వికెట్లు తీయగా.. ఖలీల్‌ అహ్మద్‌, గుర్జన్‌ప్రీత్‌ సింగ్‌, నూర్‌ అహ్మద్‌ తలో వికెట్ తీసుకున్నారు. కాగా వరుస అపజయాలు వెంటాడున్న వేళ చెన్నై ఇ సూపర్ విక్టరీని నమోదు చేయడం జట్టుకు ధైర్యాన్నిచ్చింది.

Next Story