- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు హైదరాబాద్ తో మ్యాచ్...ఇకనైనా ధోనీని ఆడేస్తారా?
ఐపీఎల్ 2026లో SRH మరో కీలక మ్యాచ్ కు సిద్ధం అవుతోంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో SRH మరో కీలక మ్యాచ్ కు సిద్ధం అవుతోంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ధోని ఆడతాడని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హోమ్ గ్రౌండ్ లో చెన్నై తన చివరి మ్యాచ్ ఆడుతోంది. ఇలాంటి క్రమంలో ధోని కచ్చితంగా నేటి మ్యాచ్ లో ఆడతాడని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఆయన పూర్తిగా ఫిట్ నెస్ సాధించారని, హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఈ తరుణంలో అభిమానులలో ఆశలు పెరుగుతున్నాయి. అటు తన చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోనే ఆడడాలనుకుంటున్న అని గతంలో ధోని మాట్లాడిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇవాళ్టి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైతే, గుజరాత్, SRH ప్లే ఆఫ్స్ లోకి వెళ్లనున్నాయి.






