- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CSK Vs RR: నిప్పులా రాజస్థాన్ పేస్ అటాక్.. 127 పరుగులకు చెన్నై ఆలౌట్
ఐపీఎల్-2026 సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ పేసర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రిమియర్ లీగ్-2026 సీజన్‌లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. రాజస్థాన్ పేసర్ల ధాటికి చెన్నై బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. దీంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది.
దుమ్ములేపిన బౌలర్లు..
మ్యాచ్ ప్రారంభం కాగానే రాజస్థాన్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ ఆరంభం నుంచే నిప్పులు చెరిగే బంతులతో చెన్నైని దెబ్బతీశారు. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, బర్గర్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తీసి చెన్నై వెన్ను విరిచారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), మాజీ ఆర్ఆర్ ప్లేయర్ సంజూ శాంసన్ (6) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. శివమ్ దూబే (6) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రాజస్థాన్ తరపున ఆడుతున్న రవీంద్ర జడేజా తన పాత టీమ్‌పై విరుచుకుపడి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. చెన్నై జట్టులో జేమీ ఓవర్టన్ (43), కార్తిక్ శర్మ (18) సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే చెప్పుకొదగిన స్కోర్ చేశారు.






