ఐపీఎల్ నుంచి CSK ఔట్

by Muthe.Rajitha |

IPL లో నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 89 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఐపీఎల్ నుంచి CSK ఔట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ లీగ్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 89 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గుజరాత్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు, ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 13.4 ఓవర్లలోనే 140 పరుగులకు ఆలౌట్‌ అయింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందకపోవడంతో జట్టుకు పరాజయం తప్పలేదు.

గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి చెన్నైని కోలుకోలేని దెబ్బతీశారు. ఆ జట్టు బౌలర్లలో మహ్మద్ సిరాజ్‌, రషీద్‌ ఖాన్‌, కాగిసో రబాడ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి తలో 3 వికెట్ల చొప్పున పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు. ఈ ఘోర ఓటమితో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ప్రస్తుత టోర్నమెంట్‌ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

Next Story