- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CSKకు మరో షాక్...ఐపీఎల్ నుంచి మాత్రే ఔట్ !
by velandi.Saikiran |
CSKకు మరో షాక్...సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా మాత్రేకు గాయం అయినట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. వరుసగా ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎల్లిస్, మహేంద్ర సింగ్ ధోని, ఫాస్ట్ బౌలర్ ఖలీల్ ముగ్గురు కూడా గాయం బారిన పడ్డారు. లేటెస్ట్ గా ఈ జాబితాలో ఆయుష్ మాత్రే కూడా చేరినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ సందర్భంగా కండరాల గాయం బారిన పడ్డాడు ఆయుష్ మాత్రే. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ కూడా వెల్లడించారు. ఆయుష్ మాత్రే తొడ కండరాలలో చీలిక వచ్చిందని వెల్లడించారు. త్వరలోనే అతనికి స్కానింగ్ కూడా చేస్తారని తెలిపారు. దురదృష్టవశాత్తు పరిస్థితి తీవ్రంగానే కనిపిస్తోందని వెల్లడించారు. దీంతో ఆయుష్ మాత్రే కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
Next Story






