సంజు శాంసన్ సెంచరీ.. కాంగ్రెస్ ఎంపీ సంచ‌ల‌న ట్వీట్

by velandi.Saikiran |   (  Updated:2026-04-24 06:58:29  IST  )

సంజు శాంసన్ సూప‌ర్ సెంచరీ చేసిన నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌ సంచ‌ల‌న ట్వీట్ చేశారు.

సంజు శాంసన్ సెంచరీ.. కాంగ్రెస్ ఎంపీ సంచ‌ల‌న ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్: చెన్నై వికెట్ కీప‌ర్ సంజు శాంస‌న్ నిన్న సెంచ‌రీ చేసిన సంగ‌తి తెలిసిందే. ముంబై వర్సెస్ సీఎస్కే మ‌ధ్య వాంఖ‌డే వేదిక‌గా మ్యాచ్ జ‌ర‌గ‌గా, 54 బంతులో 101 ప‌రుగులు చేశాడు సంజు. ఈ దెబ్బ‌కు భారీ స్కోర్ సాధించిన చెన్నై, ముంబైపై 103 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసిన సంజు శాంస‌న్ పైన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శ‌శిథ‌రూర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

శిల్పాన్ని చెక్కిన‌ట్లు సెంచ‌రీ చేశాడు

కవిత రూపంలో సంజు ఆట తీరని పొగిడారు. సంజులో తెలియని ప్రత్యేకత ఉందని మెచ్చుకున్నారు. మణికట్టును ఉపయోగిస్తూ అతడు ఆడే షాట్స్ అందంగా కనిపిస్తాయని వెల్లడించారు. బంతి బ్యాట్ కు తగిలినప్పుడు ఆ శబ్దం, టైమింగ్ చూస్తే మనం చేయాలనుకున్న పనులను అతడు సులువుగా చేస్తున్నాడని అనిపిస్తుందని వెల్లడించారు శ‌శిథ‌రూర్‌. శిల్పాన్ని చెక్కినట్లుగా స్టైలిష్ గా సెంచరీ పూర్తి చేస్తాడని కామెంట్స్ చేశారు.

Next Story