- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి శుభారంభం దక్కలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక (19), కెఎల్ రాహుల్ (12) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఒక దశలో 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆదుకున్నారు. 24 బంతుల్లో 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రిజ్వీకి తోడు కీలక సమయంలో స్టబ్స్ నిలకడగా ఆడి 31 బంతుల్లో 38 పరుగులు (1 ఫోర్, 2 సిక్సర్లు) చేశాడు. చివరలో అశుతోష్ శర్మ 5 బంతుల్లోనే 2 సిక్సర్లతో 14 పరుగులు చేసి జట్టు స్కోరును 150 దాటించాడు. చెన్నై బౌలర్లు కచ్చితమైన లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. నూర్ అహ్మద్ 2 వికెట్లు, గుర్జప్‌నీత్ సింగ్, అఖిల్ హుస్సేన్, ముకేష్ చౌదరి, జేమీ ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు.
చెన్నై టార్గెట్ 156 పరుగులు..
ఢిల్లీ విధించిన 156 పరుగుల లక్ష్యం ఛేదించడానికి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. పిచ్ స్పిన్నర్లకు కాస్త సహకరిస్తున్న తరుణంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి మేటి స్పిన్నర్లను రుతురాజ్ గైక్వాడ్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం.






