- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ ఓడితే ముంబై ఇండియన్స్ ఇంటికే !
ఐపీఎల్ 2026 లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడగా... మూడు గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఈ రోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, CSK జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఈ రెండు జట్లు నువ్వా-నేనా అన్న రేంజ్ లో పోటీ పడబోతున్నాయి. ఐపీఎల్ 2026 లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడగా... మూడు గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది.
అటు ముంబై ఎనిమిది మ్యాచ్ లలో కేవలం రెండు మాత్రమే గెలిచి.. 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్ కోసం రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. గాయాల బారిన పడి ఇద్దరు ప్లేయర్లు తమ జట్లకు దూరమయ్యారు. కానీ ఇవాళ్టి మ్యాచ్ తో ఈ స్టార్లు ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ చేతులో ముంబై ఇండియన్స్ ఓడితే, మాత్రం ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ముంబై ప్లేయర్లు ఆచితూచి ఆడాల్సి ఉంటుందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. మరి ముంబై ఏం చేస్తుందో చూడాలి.






