- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన చెన్నై సూపర్ కింగ్స్!
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు సాధించి పంజాబ్ ముందు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. సొంత గడ్డపై చెన్నై బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో చెపాక్ స్టేడియం హోరెత్తిపోయింది. సమిష్టిగా రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గైక్వాడ్ (28), ఆయూష్ (73), దూబే (45), సర్ఫరాజ్ (32) అద్భుతంగా రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ రెండు, బార్క్లెట్, జేసన్, చాహల్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే, పంజాబ్ ఈ భారీ స్కోరును ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పవర్ ప్లేలో ఎలా ఆడతారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. పంజాబ్ విజయం సాధించాలంటే 210 పరుగులు చేయాల్సి ఉంది.






