టాస్ గెలిచిన చెన్నై..ఈ మ్యాచ్ ఓడితే ఇంటికే

by velandi.Saikiran |   (  Updated:2026-05-21 13:51:01  IST  )

గుజరాత్ తో జ‌రుగనున్న ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తేనే.. ప్లే ఆఫ్స్ బరిలో ఉంటుంది.

Chennai Super Kings opt to bowl GT
X

Chennai Super Kings opt to bowl GT 

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మరికాసేపట్లో కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ నెగ్గింది. ఈ క్రమంలో మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

చెన్నై సూప‌ర్ కింగ్స్ కు చావో రేవో

గుజరాత్ తో జ‌రుగనున్న ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తేనే.. ప్లే ఆఫ్స్ బరిలో ఉంటుంది. అది కూడా ఛేజింగ్ చేస్తే, 17 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేయాలి. లేదా చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, దాదాపు 25 పరుగుల తేడాతో గుజరాత్ ను ఓడించాలి. ఈ ప్రణాళికతో చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వెళ్లాల్సి ఉంది. మరి అహ్మదాబాద్ గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.

Next Story