కార్టూన్లు చూసి, బౌలర్లకు చుక్క‌లు చూపిస్తా - వైభ‌వ్

by velandi.Saikiran |

కార్టూన్లు చూసి, బౌలర్లకు చుక్క‌లు చూపిస్తాన‌ని వైభ‌వ్ వెల్ల‌డించారు.

కార్టూన్లు చూసి, బౌలర్లకు చుక్క‌లు చూపిస్తా - వైభ‌వ్
X

దిశ‌, వెబ్ డెస్క్: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూడా అదరగొడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరన్నది చూడకుండా, చెడుగుడు ఆడేస్తున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి బలమైన జట్లపై భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్లను కూడా వణుకు పుట్టిస్తున్నాడు. అయితే అలాంటి వైభవ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

కార్టూన్స్ చూసి బ్యాటింగ్ చేస్తా

తాను ఇప్పటికీ కూడా టీవీలలో కార్టూన్లు చూస్తానని తాజాగా వైభవ్ వెల్లడించారు. వాటిని చూస్తూనే క్రికెట్ పైన దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ 15 ఏళ్ల వయసులో రెండిటి పైన దృష్టి పెట్టడం చాలా కష్టం. కానీ వైభవ్ మాత్రం కార్టూన్లతో పాటు... బ్యాటింగ్ కూడా ఇరగదీస్తున్నాడు.

ప్రతి మ్యాచ్ కు ముందు కార్టూన్లు చూడాల్సిందేనని.. ఆ తర్వాత రిలాక్స్ అయి, బ్యాటింగ్ అదరగొడతానని వెల్లడించాడు. ఒక మ్యాచ్ లో విఫలమయ్యానని.. మరో మ్యాచ్ కంటే ముందు డీలా పడిపోను అంటూ వ్యాఖ్యానించారు. మరింత అద్భుతంగా ఆడేందుకు ప్రయత్నిస్తా తప్ప, ఒత్తిడిలోకి వెళ్లబోనని వైభవ్ తెలిపారు. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ జట్టును ఛాంపియన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నాడు వైభవ్.

Next Story