- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఔట్..నెక్ట్స్ రుతురాజే అంటూ ట్రోల్స్
పాండ్యా, పంత్ పక్కకు జరిగారు. నెక్ట్స్ రుతురాజే తన కెప్టెన్సీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 చివరి అంకానికి వచ్చిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పదవికి కాసేపటికి క్రితమే రిషబ్ పంత్ రాజీనామా చేశాడు. ఈ సీజన్ లో తన ప్రదర్శనతో పాటు, లక్నో గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయినందుకు గాను బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ తప్పుకున్నాడు పంత్. భవిష్యత్తులో లక్నోలో ఉంటాడా? లేదా ? అనేది త్వరలో క్లారిటీ రానుంది. ఇక ముంబై ఇండియన్స్ యాజమాన్యమే.. హార్దిక్ పాండ్యాను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడు చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్తాడని రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి.
రుతురాజ్ రాజీనామా చేయాల్సిందే !
ఈ ఇద్దరి ఎపిసోడ్ నేపథ్యంలో, చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పైన దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. వెంటనే చెన్నై కెప్టెన్సీకి రాజీనామా చేయాలని రుతురాజ్ పై ఒత్తిడి తెస్తున్నారు నెటిజెన్స్. రుతురాజ్ తప్పుకుంటే.. సంజు శాంసన్ బాధ్యత తీసుకుంటాడని సూచనలు చేస్తున్నారు. అప్పుడైనా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తుందని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ కమ్రంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. కాగా మహేంద్రసింగ్ ధోని తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు రుతురాజ్. ఇక ఇతగాడు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఇప్పటి వరకు... చెన్నై పాతాళానికి వెళ్ళింది తప్ప, ఎప్పుడు సరిగ్గా గెలిచింది లేదు. అందుకే రాజీనామా చేయాలని ట్రోల్స్ చేస్తున్నారు.






