కేకేఆర్ బౌల‌ర్ ముజరబానీపై రెండేళ్ల బ్యాన్‌ !

by velandi.Saikiran |

కేకేఆర్ ప్లేయ‌ర్‌ బ్లెస్సింగ్ ముజరబానీపై పీఎస్ఎల్ నుంచి రెండేళ్ల నిషేధం విధించేందుకు PCB నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం.

కేకేఆర్ బౌల‌ర్ ముజరబానీపై రెండేళ్ల బ్యాన్‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పాకిస్తాన్ సూపర్ లీగ్ తో కుదుర్చుకున్న‌ ఒప్పందాన్ని చివరి క్షణంలో రద్దు చేసుకున్న కేకేఆర్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీకి ఊహించని షాక్ తగిలింది. అతనిపై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందని స‌మాచారం అందుతోంది. PSL ను కాదని చివరి క్షణంలో ఐపీఎల్ లోకి వెళ్లినందుకు గాను ఈ చర్యలు తీసుకున్న‌ట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పాకిస్తాన్ కు హ్యాండ్ ఇచ్చిన బ్లెస్సింగ్ ముజరబానీ షాక్

PSL 2026 కోసం ముందుగా బ్లెస్సింగ్ ముజరబానీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు బ్లెస్సింగ్ ముజరబానీను తీసుకుంది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభానికి వారం ముందే, బ్లెస్సింగ్ ముజరబానీకి ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. దీంతో ముస్తాఫిజుర్ రెహ‌మ‌న్ స్థానంలో కేకేఆర్ జట్టులోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తాజాగా బ్లెస్సింగ్ ముజరబానీపై చర్యలు తీసుకుందట‌ PCB. కాగా పీఎస్ఎల్ లో రూ.36 ల‌క్ష‌లు ప‌లికిన బ్లెస్సింగ్ ముజరబానీ, ఐపీఎల్ లో మాత్రం రూ.75 అందుకుంటున్నాడు.

Next Story