రోహిత్ శర్మ గాయంపై బిగ్ అప్డేట్.. జయవర్ధనే కీలక ప్రకటన

by velandi.Saikiran |   (  Updated:2026-05-01 19:17:47  IST  )

రోహిత్ శర్మ గాయంపై బిగ్ అప్డేట్ ఇచ్చారు మ‌హేల‌ జయవర్ధనే.

రోహిత్ శర్మ గాయంపై బిగ్ అప్డేట్.. జయవర్ధనే కీలక ప్రకటన
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య రేపు సాయంత్రం ఏడున్నర గంటలకు చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గాయం పై కీలక అప్డేట్ వచ్చింది.

రోహిత్ శర్మ గాయం పై కీలక అప్డేట్

ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ...నేటి మ్యాచ్ కు అందుబాటులో ఉండడంపై ముంబై కోచ్ మ‌హేల‌ జయవర్ధనే కీలక ప్రకటన చేశారు. రోహిత్ శర్మ కోలుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని తెలిపారు. మెడికల్ టీం రోజు అతన్ని పర్యవేక్షిస్తుందని వివరించారు. తాజాగా బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించారు. ఇక ఇవాళ మెడికల్ టీం ఇచ్చే రిపోర్టును బట్టి నిర్ణయం తీసుకుంటామని మహిళా జయవర్ధనే చెప్పుకొచ్చారు. కాగా గాయం కారణంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడలేదన్న‌ సంగతి తెలిసిందే.

Next Story