- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRHకు బిగ్ షాక్...5 వికెట్లు డౌన్
by velandi.Saikiran |
SRHకు బిగ్ షాక్...వంద పరుగుల లోపే 5 వికెట్లు పడిపోయాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రాజస్థాన్ రాయల్స్ విధించిన 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుసగా వికెట్లను కోల్పోతోంది. 100 లోపే ఐదు వికెట్లు కోల్పోయిన SRH, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ మినహా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు మొత్తం విఫలమయ్యారు. జోప్రా ఆర్చర్ బౌలింగ్ దెబ్బకు విలవిలలాడిపోయారు. ఇక అభిషేక్ శర్మ రెండో బంతికే డకౌట్ కాగా.. హెడ్ 17 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 33 పరుగులు చేయగా.. సమ్రాన్ రవిచంద్రన్ ఒకే ఒక్క పరుగు సాధించాడు. క్లాసెన్ 18 పరుగులు చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి, సలీం అరోరా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి వికెట్ కోల్పోయినా మ్యాచ్ మొత్తం రాజస్థాన్ రాయల్స్ చేతిలోకి వెళుతుంది.
Next Story






