ఐపీఎల్ ఫైన‌ల్స్..బెంగ‌ళూరు పోలీసులు షాకింగ్ నిర్ణ‌యం !

by velandi.Saikiran |

ఇవాళ ఫైనల్ సందర్భంగా మరోసారి బెంగుళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఐపీఎల్ ఫైన‌ల్స్..బెంగ‌ళూరు పోలీసులు షాకింగ్ నిర్ణ‌యం !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్స్ సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. ఇలాంటి క్రమంలో బెంగుళూరు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత సీజన్ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా, తొక్కిసలాట జరిగి RCB అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఫైనల్ సందర్భంగా మరోసారి బెంగుళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. నేటి మ్యాచ్ లో బెంగుళూరు టైటిల్ గెలిస్తే, బహిరంగ ప్రదేశాల్లో సంబరాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు.

అంతేకాదు పర్మిషన్ లేకుండా రహదారులపై ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. బహిరంగ ప్రదేశాలలో గుమిగూడకూడదని వెల్లడించారు. మాల్స్, పబ్స్ లాంటి వ్యాపార సంస్థలు... సాధారణ ప్రజలకు స్క్రీన్లు కనిపించేలా ఏర్పాటు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫైనల్ ముగిసిన తర్వాత రోడ్లపై స్టంట్స్, హారన్ కొట్టడం లాంటివి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. టపాసులు కాల్చకుండా కూడా నిషేధం విధించారు. ఓపెన్ ప్లేస్ లలో మద్యపానం చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మ్యాచ్ కు సంబంధించి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ బెంగళూరు ఓడినా, జనాల నుంచి ఎదురయ్యే పరిస్థితిలను కూడా అంచనా వేస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలను రిపీట్ చేయకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story