శ్రేయ‌స్ అయ్య‌ర్ కు బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్ !

by velandi.Saikiran |   (  Updated:2026-04-19 17:22:05  IST  )

భార‌త టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్య‌ర్ అవ‌కాశం ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

శ్రేయ‌స్ అయ్య‌ర్ కు బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 లో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. భారత జట్టు టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియామకం చేసేందుకు రంగం సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీ20 కెప్టెన్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ ను తొలగించి, అతి త్వరలోనే శ్రేయస్ అయ్యర్ పేరును ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నమెంటులో శ్రేయస్ అయ్యర్ నాయకత్వం పట్ల సానుకూలతో ఉంది బీసీసీఐ. ఇటు టీ20 క్రికెట్ లో నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బాగా సెట్ అవుతాడు. నాలుగు స్థానంలో సరైన ప్లేయర్ లేక భారత జ‌ట్టు చాలా రోజులుగా సతమతమవుతోంది.

సూర్య‌పై వేటు, శ్రేయ‌స్ అయ్య‌ర్ కు కెప్టెన్సీ

దీంతో అతన్ని కెప్టెన్ గా నియామకం చేసి, జ‌ట్టులోకి తీసుకునేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. టీ20 కెప్టెన్ గా రిషబ్ పంత్, శుభ‌మాన్ గిల్ ఇద్దరు పోటీలో ఉన్నప్పటికీ అయ్యర్ వైపు బీసీసీఐ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా టీ20 సిరీస్ లు గెలుస్తోంది. కానీ సూర్యకుమార్ వ్యక్తిగత పర్ఫామెన్స్ మాత్రం చాలా చెత్తగా ఉంది. ఐపీఎల్ లో కూడా అతడి మెరుపులు ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ పదవికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు క్రీడా విశ్లేషకులు. దానికి తగ్గట్టుగానే నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

Read More.. CSKకు మరో షాక్...ఐపీఎల్ నుంచి మాత్రే ఔట్ !

Next Story