రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై బీసీసీఐ సీరియ‌స్‌..అతడిపై వేటు !

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026 లో టాప్ గేర్ లో దూసుకు వెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై బీసీసీఐ సీరియ‌స్‌..అతడిపై వేటు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో టాప్ గేర్ లో దూసుకు వెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ జట్టుపైన యాక్షన్ తీసుకునేందుకు ఐపీఎల్ కౌన్సిల్ రంగం సిద్ధం చేసిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. RCBతో రెండు రోజుల కిందట రాజస్థాన్ రాయల్స్ తలపడింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా డ‌గౌట్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ వాడుతూ కనిపించాడు. పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. దీంతో ఇద్దరూ మొబైల్ చూస్తున్న వీడియో వైరల్ గా మారింది.

యాక్ష‌న్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిన ఐపీఎల్ కౌన్సిల్

రూల్స్ ప్రకారం డ‌గౌట్ లో ఎవరు కూడా మొబైల్స్ తో పాటు ఎలక్ట్రిక్ వస్తువులు వాడకూడదు. ఒకవేళ వాడితే కచ్చితంగా బీసీసీఐ చర్యలు తీసుకుంటుంది. ఇక లేటెస్ట్ గా అలాంటి తప్పిదమే రాజస్థాన్ రాయల్స్ చేసింది. ఈ సంఘటన నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ యాక్షన్ తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ పైన భారీ స్థాయిలో ఫైన్ పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అలాగే మేనేజర్ రోమి భిందర్ కూడా సస్పెండ్ అవుతాడని అంటున్నారు. పక్కన కూర్చున్న వైభవ్ పైన ఒకటి లేదా రెండు మ్యాచ్ లు ఆడకుండా బ్యాన్ విధిస్తారని తెలుస్తోంది.

Next Story