- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరులో అందుకే IPL ఫైనల్ నిర్వహించట్లేదు
KSCA అదనపు టికెట్లు అడగటం వల్ల బెంగళూరులో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు సైకియా.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామిలో కాకుండా అహ్మదాబాద్ వేదికగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఫైనల్ వేదిక తరలిపోవడంపై అనేక రకాల వార్తల వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ( Devajit Saikia ) క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అదనపు టికెట్లు అడగటం వల్ల బెంగళూరులో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అదనంగా టికెట్లు ఆడుగుతున్నారు - దేవజిత్ సైకియా
ప్రోటోకాల్ ప్రకారం హోస్టింగ్ అసోసియేషన్ కు మొత్తం సీటింగ్ లో 15% కంప్లిమెంటరీ ఇవ్వాలని వివరించారు. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వదనంగా మరో పదివేల టికెట్లు అడిగిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు దేవజిత్ సైకియా. ఈ క్రమంలోనే వేదికను మార్చినట్లు వివరించారు సైకియా. అటు తామేమి టికెట్లు అడగలేదని డీకే శివ కుమార్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ స్టేడియం పెద్దదిగా ఉన్న నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ తరలిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.






