క్రికెట‌ర్ల‌కు షాక్..ఐపీఎల్ లో కొత్త రూల్

by velandi.Saikiran |

ఐపీఎల్ జట్లలో బెంచ్ కు పరిమితం అయిన ఆటగాళ్లకు కొత్త రూల్స్ అమలు చేయబోతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

క్రికెట‌ర్ల‌కు షాక్..ఐపీఎల్ లో కొత్త రూల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ క్రికెటర్లకు బిగ్ అలర్ట్. ఐపీఎల్ జట్లలో బెంచ్ కు పరిమితం అయిన ఆటగాళ్లకు కొత్త రూల్స్ అమలు చేయబోతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇకపైన టీం షీట్ లోని 16 మందికే గ్రౌండ్ లోకి అనుమతి ఉంటుందని అధికారిక ప్రకటన చేసింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ కూడా గ్రౌండ్ లో అడుగు పెట్టకూడదని వెల్లడించింది. 16 మంది తప్ప మిగిలిన ప్లేయర్లు డ్రింక్స్, బ్యాట్లు, సందేశాలు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ.

బెంచ్ కు ప‌రిమితమైన ప్లేయ‌ర్ల‌కు కీల‌క ఆదేశాలు

బౌండరీ చుట్టూ ఐదుగురు కంటే ఎక్కువ మంది బెంచ్ ప్లేయర్లు ఉండకూడదని స్పష్టం చేసింది. LED యాడ్ బోర్డులు, బౌండరీ లైన్ మధ్య తిరగడానికి వీలులేదని పేర్కొంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అటు ఇప్ప‌టికే స్లీవ్ లెస్ జెర్సీల‌తో గ్రౌండ్ లోకి రాకూడ‌ద‌ని ఇప్ప‌టికే బీసీసీఐ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. అలాగే కుటుంబ స‌భ్యులు, భార్య‌లను డ్రెస్సింగ్ రూమ్స్ లోకి తీసుకురాకూడ‌దు. సొంత వాహ‌నాల్లో హోట‌ల్స్ నుంచి స్టేడియాల‌కు రాకూడ‌ద‌ని వెల్ల‌డించింది బీసీసీఐ.

Next Story