తిలక్‌‌ను బాడీ షేమింగ్ చేసిన అర్ష్‌దీప్!.. అంత మాట అన్నాడా?.. అర్ష్‌దీప్‌పై నెటిజన్లు ఫైర్

by Harish |

తిలక్‌‌ను బాడీ షేమింగ్ చేసిన అర్ష్‌దీప్!.. అంత మాట అన్నాడా?.. అర్ష్‌దీప్‌పై నెటిజన్లు ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి చిక్కుల్లో ఇరుకున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ‌పై అతను చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. గురువారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగింది. ఈ గేముకు ముందు అర్ష్‌దీప్.. ఎంఐ బ్యాటర్లు నమన్ ధిర్, తిలక్‌తో ఓ వీడియో తీశాడు. ఆ వీడియోలో తిలక్‌ను ‘అంధేరే’అని పిలిచాడు.అంధేరే అంటే తెలుగులో చీకటి లేదా నల్లవాడు అని అర్థం. అంతటితో ఆగని అర్ష్‌దీప్.. సన్‌స్క్రీన్ రాసుకోలేదా? అని అడిగాడు. అనంతరం పంజాబ్‌కే చెందిన నమన్ ధిర్‌ను నిజమైన ‘నూర్’అని సంభోదించాడు. నూర్ అంటే కాంతి అని అర్థం. అదే వీడియోలో తిలక్ తాను సన్‌స్క్రీన్ రాసుకున్నానని బదులిచ్చాడు.

ఇదంతా అర్ష్‌దీప్ సరదాగానే చేసినట్టు కనిపిస్తుంది. కానీ, తిలక్ రంగును ఉద్దేశించి మాట్లాడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తిలక్‌ను బాడీ షేమింగ్ చేశాడని, ఇది జాత్యాహంకారం కిందకు వస్తుందని మండిపడుతున్నారు. ఇటీవల అర్ష్‌దీప్ చేసిన ఓ వ్లాగ్‌లో యుజువేంద్ర చాహల్ ఫేక్ వేపింగ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో బీసీసీఐ అతన్ని ఇకపై డ్రెస్సింగ్ రూం వీడియోలు, వ్లాగ్‌లు చేయుద్దని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తిలక్‌పై చేసిన కామెంట్స్‌తో అర్ష్‌దీప్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మరి, బీసీసీఐ అతనిపై ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి.

Next Story