IPL : తొలి క్వాలిఫైయర్.. ఫైనల్లోకి దూసుకు వెళ్లిన బెంగుళూరు

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫైయర్ మ్యాచులో RCB గుజరాత్ ను చిత్తుగా ఓడించి, ఫైనల్ కు దూసుకు వెళ్ళింది.

IPL : తొలి క్వాలిఫైయర్.. ఫైనల్లోకి దూసుకు వెళ్లిన బెంగుళూరు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫైయర్ మ్యాచులో RCB గుజరాత్ ను చిత్తుగా ఓడించి, ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగుకు దిగిన బెంగుళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్(93) పరుగులు చేసి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం 255 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ తడబడ్డారు. సుదర్శన్(14), గిల్(2) పరుగులకే అవుటయ్యాడు. అనంతరం వచ్చిన బట్లర్(29) పరుగులతో రాణిస్తుండగా.. హేజల్ వుడ్ చేతిలో ఔట్ అయ్యాడు.

RCB బౌలర్లు చెలరేగడంతో ఒక దశలో 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. రాహుల్‌ తెవాతియా(68) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లకు 162 పరుగులకే ఆల్ ఔట్ అయింది. దీంతో బెంగుళూరు 92 పరుగులతో ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో ఈనెల క్వాలిఫైయర్-2 ఆడనుంది గుజరాత్. కాగా రేపు హైదరాబాద్, రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

Next Story