- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ లో కొత్త రూల్..ఇకపై వాటిపై నిషేధం !
ఐపీఎల్ లో కొత్త రూల్..ఇకపై సన్ గ్లాసెస్‌పై నిషేధం విధించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. కేవలం క్వాలిఫైయర్ 2, ఫైనల్స్ రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ లో స్మార్ట్ సన్ గ్లాసెస్ పై నిషేధం విధించింది. ఐపీఎల్ ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ ఇకపైన స్మార్ట్ సన్ గ్లాసెస్, స్మార్ట్ గాగుల్స్ వాడకుండా నిషేధం విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు మే 18 వ తేదీన ఫ్రాంచైజీలకు ప్రోటోకాల్స్ జారీ చేసినట్లు క్రిక్ బజ్ స్పష్టం చేసింది. ఇలాంటి గ్లాసెస్ లో లైవ్ స్ట్రీమింగ్, టెక్స్ట్ మెసేజ్ లను పంపడం, మొబైల్ డేటా ద్వారా ఆడియో వీడియో కాలింగ్ ఆప్షన్స్ ఉన్నాయని వెల్లడించింది. వీటిని ధరించడం వల్ల, మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్ లేదా ప్లేయర్ల ఏరియా నుంచి వ్యూహాలు, అంతర్గత సమాచారం క్షణంలో బయటకు వెళ్లే ప్రమాదం ఉందని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందట. ఈ తరుణంలోనే బ్యాన్ విధించినట్లు క్రిక్ బజ్ క్లారిటీ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా విరాట్ కోహ్లీ ఇలాంటి తరహా గ్లాసెస్ కు ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.






