- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్..ఐపీఎల్ నుంచి అక్షర్ పటేల్ ఔట్ !
అక్షర్ గాయం తీవ్ర తరం అయిన నేపథ్యంలో అతడు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నుంచి వైదొలిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టోర్నమెంట్ నుంచి దూరమయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగిన తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కెప్టెన్ అక్షర్ పటేల్ ( Axar Patel) కాలి కండరాలు పట్టేశాయి. దీంతో బ్యాటింగ్ చేయలేక రిటైర్డ్ ఔట్ గా వెనిదిరిగాడు అక్షర్ పటేల్. ఈ సంఘటన ఢిల్లీ ఛేజింగ్ చేస్తున్న క్రమంలో 16వ ఓవర్ సందర్భంగా చోటు చేసుకుంది.
కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు ?
అక్షర్ పటేల్ గాయం తీవ్ర తరం అయిన నేపథ్యంలో అతడు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నుంచి వైదొలిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ అక్షర్ పటేల్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, డేంజర్ ఆటగాడు KL రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కించుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కాగా నిన్నటి మ్యాచ్ సందర్భంగా బెంగళూరు పైన 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడి విజయం సాధించింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చివరి వరకు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్ల వద్ద ఛేదించింది.






