- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లే ఆఫ్స్ లో సన్ రైజర్స్ ను ఆపడం కష్టమే - అక్షర్ పటేల్
ప్లే ఆఫ్స్ లో సన్ రైజర్స్ ను ఆపడం కష్టమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అక్షర్ పటేల్.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో లీగ్ దశ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇక రేపటి నుంచి ప్లే ఆఫ్స్ షురూ అవుతాయి. ఇలాంటి క్రమంలో ఎలిమినేట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ప్లే ఆఫ్స్ కు చేరుకున్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యంత ప్రమాదకరంగా ఉందని వార్నింగ్ ఇచ్చారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ లో టాప్ 3 బ్యాటర్లు అభిషేక్, హెడ్, ఇషాన్ రాణిస్తే.. ఆ జట్టును ఆపడం ఎవరి తరం కాదని డేంజర్ బెల్స్ పంపించారు. అదే ఆ ముగ్గురు ఔట్ అయితే.. పరిస్థితి చక్కదిద్దేందుకు క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి మిడిల్ ఆర్డర్ లో అత్యంత ప్రమాదకరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ కాంబో చాలా మ్యాచ్ లను గెలిపించిందని కూడా గుర్తు చేశారు. కమిన్స్ ఇలాంటి అంతర్జాతీయ ప్లేయర్ కెప్టెన్ గా ఉండడం హైదరాబాద్ కు మరింత అడ్వాంటేజ్ అన్నారు. దీంతో అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.






