SRH ఓట‌మికి ఆ ఒక్క‌డే కార‌ణం..అశ్విన్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

by velandi.Saikiran |

SRH ఓట‌మిపై అశ్విన్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

SRH ఓట‌మికి ఆ ఒక్క‌డే కార‌ణం..అశ్విన్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో SRH అత్యంత దారుణంగా ఓడిపోయింది. బలమైన బ్యాటింగ్ దళం ఉన్నప్పటికీ SRH ప్లేయ‌ర్లు, మ్యాచ్ ను వదిలేశారు. కేవలం 15 ఏళ్ల కుర్రాడు వైభవ్, సన్ రైజర్స్ కు చుక్కలు చూపించాడు. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ లో సందర్భంగా 47 పరుగుల తేడాతో చాలా దారుణంగా ఓడిపోయింది హైదరాబాద్. అయితే హైదరాబాద్ ఓటమిపై తాజాగా రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంటుందని.. అయినప్పటికీ టాప్ ఆర్డర్ విఫలం కావడం కొంపముంచిందన్నారు.

రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లే సందర్భంగా వికెట్లు పడకుండా కాపాడుకుందని.. కానీ హైదరాబాద్ మాత్రం 50 పరుగులు పూర్తి చేసే వరకు దాదాపు 5 వికెట్లను పోగొట్టుకున్నట్లు విమర్శలు చేశారు. ఇషాన్ కిషన్ కాసేపు ఓపికగా ఆడి ఉంటే మ్యాచ్ స్వరూపం మారిపోయేది అన్నారు. ట్రావిస్ హెడ్ అయినా, నిలదొక్కుకుంటే రిజల్ట్ మారిపోయేదని వ్యాఖ్యానించారు అశ్విన్. వికెట్లన్నీ పోయినా కూడా.. నితీష్ కుమార్ రెడ్డి మంచి టచ్ లోకి వచ్చాడని తెలిపారు. కానీ 13 ఓవర్ తర్వాత చెత్త షాట్ కోసం వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడని మండిపడ్డారు. ఆ సమయంలో ఓవర్ కు 11 పరుగులు చేయాల్సిన పరిస్థితి మాత్రమే ఉందన్నారు. నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో ఉండి ఉంటే హైదరాబాద్ గెలిచేదని వెల్లడించారు. ఈ ఓటమికి అతడు మూల కారణమని ఫైర్ అయ్యారు.

Next Story