ఇక ఆ వేశాలు ఆపేయ్.. అర్ష్‌దీప్‌కు BCCI వార్నింగ్

by velandi.Saikiran |

అర్ష్‌దీప్‌ సింగ్ చేసే వ్లాగింగ్, యూట్యూబ్ వీడియోలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఆ వేశాలు ఆపేయ్.. అర్ష్‌దీప్‌కు BCCI వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్ కు ఊహించని షాక్ తగిలింది. అర్ష్‌దీప్‌ సింగ్ చేసే వ్లాగింగ్, యూట్యూబ్ వీడియోలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 ముగిసే వరకు వాటిని ఆపేయాలని అర్ష్‌దీప్‌ సింగ్ కు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల విమానంలో చాహల్ వేపింగ్ చేశారన్న వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

ఈ సంఘటన నేపథ్యంలో వ్లాగింగ్ ఆపేయాలని అర్ష్‌దీప్‌ సింగ్ కు సూచనలు చేసిందట బీసీసీఐ. ప్రతి మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్‌ సరదాగా రీల్స్ చేసి పోస్టు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా చాహల్ ఈ-సిగరెట్ తాగుతున్నట్లు అర్ష్‌దీప్‌ సింగ్ పోస్ట్ చేసిన వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో వైర‌ల్ గా మారింది. దీనిపై తీవ్ర స్థాయిలో నెటిజెన్స్ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ తరుణంలోనే బీసీసీఐ రియాక్ట్ అయిందట‌. వ్లాగింగ్ తాత్క‌లింగా ఆపాల‌ని సూచ‌న‌లు చేసిన‌ట్లు టాక్‌.

Next Story