- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 ఏళ్లల్లో కేవలం ఐదు మ్యాచ్ లే..సచిన్ కొడుకుపై దారుణంగా ట్రోల్స్ !
ఫాస్ట్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న అర్జున్ టెండూల్కర్, ఇప్పటి వరకు కేవలం 5 ఐపీఎల్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిన్నతనంలోనే భారత జట్టులోకి వచ్చి ఎన్నో విజయాలు అందించాడు. సెంచరీలు, అర్థ సెంచరీలు.. టన్నుల కొద్ది పరుగులు చేసి రికార్డులు కొల్లగొట్టాడు. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. భారత జట్టులో అవకాశం గురించి పక్కకు పడితే... ఐపీఎల్ లోనే అతనికి అవకాశం రావడం లేదు. ఫాస్ట్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న అర్జున్ టెండూల్కర్, ఇప్పటి వరకు కేవలం 5 ఐపీఎల్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. సచిన్ కొడుకు అన్న గౌరవంతోనే అవకాశాలు కూడా వచ్చాయి.
2021లో ఐపీఎల్ టోర్నమెంట్ లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం లక్నోలో జట్టులో కొనసాగుతున్నాడు. అయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో కేవలం 5 మ్యాచ్ లలో మాత్రమే అర్జున్ కు అవకాశం వచ్చింది. అది కూడా ముంబై ఇండియన్స్ ఛాన్స్ ఇచ్చింది. లక్నో తరఫున వాటర్ బాయ్ గా తప్ప... జట్టు సభ్యుడిగా మాత్రం ఇప్పటి వరకు బరిలోకి దిగలేదు. ఇప్పటికే లక్నో ఎలిమినేట్ కాగా, చివరి మ్యాచ్ లో అయినా అర్జున్ టెండూల్కర్ కు అవకాశం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి లక్నో యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, ట్రేడ్ ప్రక్రియ ద్వారా ఈ సీజన్ కంటే ముందు ముంబై నుంచి లక్నోలోకి అర్జున్ వచ్చాడు.






