IPL 2026లో మరో వేపింగ్ వివాదం.. ఏకంగా విమానంలో ఈ-సిగరెట్‌తో కెమెరాకు చిక్కిన చాహల్

by Ramesh Naini |   (  Updated:2026-05-07 13:06:41  IST  )

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో వేపింగ్ వివాదం తెరపైకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఘటన మరువకముందే.. తాజాగా పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమానంలో వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ చిక్కుల్లో పడ్డాడు.

IPL 2026లో మరో వేపింగ్ వివాదం.. ఏకంగా విమానంలో ఈ-సిగరెట్‌తో కెమెరాకు చిక్కిన చాహల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో వేపింగ్ వివాదం తెరపైకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఘటన మరువకముందే.. తాజాగా పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమానంలో వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో సహచర ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ఒక వ్లాగ్ చిత్రీకరించాడు. అందులో చాహల్ వేపింగ్ చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు, చిన్న క్లిప్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వివాదం చెలరేగడంతో వ్లాగ్ అసలు వెర్షన్‌ను ఎడిట్ చేసి, ఆ దృశ్యాలను తొలగించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై పంజాబ్ ఫ్రాంచైజీ గానీ, చాహల్ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

రియాన్ పరాగ్ ఉదంతం, అశ్విన్ సలహా

కొద్ది రోజుల క్రితం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కాడు. దీంతో అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ యువ ఆటగాళ్లకు కీలక సలహా ఇచ్చాడు. ‘ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత ఎంపికలు, అలవాట్లను పబ్లిక్ స్పేస్‌లో ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. ఫ్రాంచైజీకి లీడర్‌గా ఉంటూ, ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచే ఆటగాళ్లు మరింత బాధ్యతాయుతంగా మెలగాలి’ అని అశ్విన్ ఓ అన్నయ్యగా పరాగ్‌కు హితవు పలికాడు.

Next Story