- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరెంజ్ ఆర్మీలోకి మరో విధ్వంస యంగ్ బౌలర్.. అంబరీష్
యువ సంచలన బౌలర్ ఆర్.ఎస్. అంబరీష్ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో జాయిన్ కాబోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తన బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునే క్రమంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైన సీనియర్ బౌలర్ శివం మావి స్థానంలో, అండర్-19 ప్రపంచకప్ విజేత, యువ సంచలనం ఆర్.ఎస్. అంబరీష్ (RS Ambrish) ను జట్టులోకి ఆహ్వానించింది. తమిళనాడుకు చెందిన ఈ 18 ఏళ్ల యువ ఆటగాడు ఇటీవల ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరపున అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. టోర్నమెంట్‌లో కీలకమైన 11 వికెట్లు పడగొట్టడమే కాకుండా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అంబరీష్ కేవలం బౌలింగ్‌కే పరిమితం కాకుండా, ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ మిడిల్ ఆర్డర్‌లో భారీ షాట్లు కొట్టగల సామర్థ్యం ఉన్న సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావడంతో SRH మేనేజ్‌మెంట్ అతడిని రూ.30 లక్షలకు సైన్ చేసింది. 18 ఏళ్ల చిన్న వయస్సులోనే మంచి వేగం మరియు అదనపు బౌన్స్‌ను రాబట్టగల అంబరీష్, హైదరాబాద్ పిచ్‌లపై తన వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులను కట్టడి చేయగలడని జట్టు యాజమాన్యం నమ్మకంగా ఉంది. ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కూడా ఈ 'తమిళ్ తంబీ' రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.






