- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే సీజన్ లో చూసుకుందాం.. అక్షర్ వ్యాఖ్యలపై ట్రోల్స్
వచ్చే సీజన్ లో చూసుకుందాం అంటూ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై ట్రోల్స్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో నిన్న జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో దారుణంగా ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ప్రత్యర్థి కేకేఆర్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే, ఢిల్లీ చేతులెత్తేసింది. నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీపైన ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది కేకేఆర్. అయితే ఈ మ్యాచ్ ఓటమి తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాము చేసిన తప్పులపై ఆలోచించాల్సిన టైం వచ్చిందన్నారు. వచ్చే సీజన్ లో ఎలా ఆడాలో ప్లాన్ చేసుకుంటామని.. వెల్లడించారు. వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి కసరత్తులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఇకపై వాళ్లకు అవకాశం ఇస్తాం - అక్షర్ పటేల్
ఇక బెంచ్ లో ఉన్న ఏ ప్లేయర్ కు ఛాన్స్ ఇవ్వాలి ? ఏ మార్పులు చేయాలి ? అనే దానిపైన దృష్టి పెడతామని స్పష్టం చేశారు అక్షర్ పటేల్. అయితే, అక్షర్ పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ దారుణంగా విఫలమయ్యాడని ఫైర్ అవుతున్నారు. ముందుగా బాపూను లేపేయండి అంటూ ఢిల్లీ యాజమాన్యానికి సూచనలు చేస్తున్నారు. ఈ సీజన్ గురించి మాట్లాడకుండా... ఐపీఎల్ 2027 గురించి కామెంట్ చేయడంపై సీరియస్ అవుతున్నారు అభిమానులు. ఇలాంటి కెప్టెన్ తో ముందుకు వెళ్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఎన్నడూ కూడా టైటిల్ గెలవబోదని కౌంటర్లు పేల్చుతున్నారు. కాగా 11 మ్యాచ్ లలో కేవలం నాలుగు విజయాలతో ఢిల్లీ... ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ఆవిరి అయ్యాయి.






