- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ...కోహ్లీ, రోహిత్ రికార్డులు బ్రేక్ !
SRH ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ము లేపాడు. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ సెంచరీ నమోదు చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ము లేపాడు. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేవలం 47 బంతుల్లోనే తొమ్మిది సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ, ఏడు ఫోర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో అభిషేక్ శర్మకు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. ఈ సీజన్ లో ఇతనికి మొదటిది. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ 2026 లో మొత్తం 4 సెంచరీలు నమోదు అయ్యాయి. మొదటి సెంచరీ సంజు శాంసన్ చేయగా, ఆ తర్వాత డికాక్, తిలక్ వర్మ చేశారు. ఇక ఇవాళ ఉప్పల్ లో అభిషేక్ శర్మ సెంచరీ కొట్టేశాడు.
కోహ్లీ, రోహిత్ రికార్డులు బ్రేక్
ఢిల్లీ క్యాపిటల్స్ పై సెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో ఐపీఎల్ తో కలిపి ఇప్పటి వరకు 9 సెంచరీలు నమోదు చేసిన అభిషేక్ శర్మ... కోహ్లీ రికార్డ్ సమం చేశాడు. ఇప్పటి వరకు భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 9 సెంచరీలు చేయగా రోహిత్ శర్మ ఎనిమిది నమోదు చేశారు. ఇక ఇప్పుడు అభిషేక్ శర్మ సెంచరీల సంఖ్య కూడా 9కి చేరింది.






